మూసాపేటలో లిఫ్ట్ ప్రమాదం.. లిఫ్ట్, గోడ మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తి..
హైదరాబాద్లోని మూసాపేటలో ఓ వ్యక్తి లిఫ్ట్ ప్రమాదానికి గురికావడం కలకలం రేపింది.
Moosapet lift incident


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)నగరంలోని మూసాపేటలోని అంజనేయనగర్లో ఓ వ్యక్తి లిఫ్ట్ ప్రమాదానికి గురికావడం కలకలం రేపింది.

గంటన్నర పాటు తీవ్రంగా శ్రమించిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది చివరికి బాధితుడిని ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటన ఆదివారం నాడు జరగగా.. స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పాత తరహా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లో మురళి (40) తన భార్యతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు చేరుకున్నారు.

లిఫ్ట్ రెండో అంతస్తులో ఆగిన వెంటనే మురళి బయటకు వస్తుండగా, అదే సమయంలో మూడో అంతస్తుకు వెళ్లేందుకు ఎవరో లిఫ్ట్ బటన్ నొక్కారు. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా పైకి కదిలింది. ఆ సమయంలో మురళి ఒక కాలు లిఫ్ట్లో, మరో కాలు రెండో అంతస్తులో ఉండటంతో ఆయన కాలు లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. లిఫ్ట్ పైకి వెళ్లడంతో లిఫ్ట్, గోడ మధ్య మురళి ప్రమాదకర స్థితిలో వేలాడుతూ చిక్కుకుపోయారు. అయితే, ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆయన భార్య కేకలు వేయడంతో అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అతన్ని రక్షించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. దీంతో కూకట్పల్లి హైడ్రా డీఆర్ఎఫ్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

మరోవైపు, సనత్నగర్ ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. హైడ్రాలిక్ కట్టర్ సహాయంతో సుమారు గంటన్నరపాటు తీవ్రంగా శ్రమించి బాధితుడిని రక్షించారు. ఈ ప్రమాదంలో మురళికి కాలు విరిగినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande