హైదరాబాద్లో దారుణం.. బాలికపై అత్యాచారం..
హైదరాబాద్లోని ఉప్పల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు.
Case rape


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)ఉప్పల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలిక(17)పై కామాంధుడు రెచ్చిపోయాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. మరోవైపు నిందితుడికి బాలిక తల్లి సహకరించడం సంచలనంగా మారింది. ఆమె సమక్షంలోనే కామాంధుడు మైనర్పై పలుమార్లు లైంగిక దాడికి తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో తల్లితో కలిసి బాలిక నివసిస్తోంది. బతుకుతెరువు కోసం వీరిద్దరూ నగరానికి వలస వచ్చారు. ఇటీవల బాలిక తల్లికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతను తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో చిన్నారిపై నిందితుడి కన్నుపడింది. బాలికను లోబరుకుని కామావాంఛలు తీర్చుకోవాలని చూశాడు. ఈ దారుణానికి బాలిక తల్లి సహకరించింది. ఆమె ఇంట్లో ఉండగానే చిన్నారిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాతా లైంగిక వేధింపులు ఆగలేదు. వరుసగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. మేడిపల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లిన నిందితుడు, బాలిక తల్లి ఆమెకు జులైలో గర్భస్రావం చేయించారు.

దీనికి బాలిక బంధువు ఒకరు సహకరించడం గమనార్హం. అనంతరం చిన్నారి దాదాపు ఎనిమిది రోజుల పాటు అదే ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అయితే, ఉప్పల్ ప్రాంతంలోనే ఉంటున్న తన అక్క ఇంటికి వారం రోజుల కిందట బాలిక వెళ్లింది. నిందితుడితో కలిసి తన తల్లి చేసిన దారుణాన్ని అక్కకి వివరిస్తూ భోరున విలపించింది. దీంతో వెంటనే చెల్లిని వెంటపెట్టుకుని ఉప్పల్ పోలీసు స్టేషన్కు వెళ్లిన అక్క ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande