కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు.
Konda lakshman bapuji


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. కొండా బాపూజీ ఇంట్లోనే టీఆర్ఎస్ పుట్టిందని గుర్తుచేశారు. ఉద్యమాలే ఊపిరిగా... పోరాటాలే పరమావధిగా బ్రతికిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పుట్టిందని.. జలదృశ్యం సాక్షిగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని... వారి పేరును హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని గౌరవించిందన్నారు. నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంటూ ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande