అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్లోని మలక్పేట్లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మూసారాంబాగ్ శాలివాహన నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Suicide


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) నగరంలోని మలక్పేట్లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మూసారాంబాగ్ శాలివాహన నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్(35) ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు. అయితే చనిపోయే ముందు అర్ధరాత్రి ఓ యువతికి కానిస్టేబుల్ వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది.

తాను ఉరేసుకుంటున్నట్లు యువతికి చెప్పాడు. ఆందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. చైతన్యపురి పోలీసులు.. మలక్పేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.

ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే కానిస్టేబుల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు చంద్రశేఖర్ అంబర్పేట్ హెడ్క్వార్టర్స్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కానిస్టేబుల్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande