
హైదరాబాద్ , 21 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సంస్థ సూచించింది. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా ఒకే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఒకవైపు రుతుపవనాల కదలికలు మారుతుండగా, మరోవైపు స్థానిక వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో తెలంగాణలో వర్షాలకు అవకాశం ఉంటోంది. వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా భారీ వర్షాల సూచన జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్