వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు, సహ-ఇన్ఛార్జీలను ప్రకటించిన భాజపా
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు, సహ-ఇన్ఛార్జీలను ప్రకటించిన భాజపా
బీజేపీ


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 (హి.స)

భారతీయ జనతా పార్టీ (భాజపా) కేంద్ర నాయకత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలు, సహ-ఇన్ఛార్జీల నియామకాన్ని చేపట్టింది. పార్టీ జాతీయ నిర్వాహకుల నియామకం పూర్తయిన నెల రోజుల తర్వాత, భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదంతో ఈ నియామకాలను ఖరారు చేశారు.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్ఛార్జ్, రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్ బుధవారం ఈ నియామకాల అధికారిక జాబితాను విడుదల చేశారు.

ఈ కొత్త బాధ్యతల్లో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీకి హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. దాద్రా నగర్ హవేలీ పరిధిని కూడా ఆమె పర్యవేక్షించనున్నారు. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్‌గా సీనియర్ నేత వినోద్ తావ్డేను నియమించారు. ఆయనకు సహాయంగా జగదీష్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ వర్మ, అనంత్ ఓఝాలను సహ-ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఇన్ఛార్జ్‌గా డాక్టర్ సతీష్ పూనియా, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్‌గా విప్లవ్ కుమార్ దేవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ ఇన్ఛార్జ్‌గా వినయ్ సహస్రబుద్ధే నియామకమవ్వగా, జామ్యాంగ్ త్సేరింగ్ నామ్‌గ్యాల్, దర్శనా బెన్ జర్దోష్‌లకు అక్కడ సహ-ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. గుజరాత్‌కు తరుణ్ చుగ్ ఇన్ఛార్జ్‌గా, అజయ్ మహావర్, గోమతీ సాయి సహ-ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు. మహారాష్ట్రలో బైజయంత్ జయ్ పాండా ఇన్ఛార్జ్‌గా, అమిత్ మాలవీయా, సదానంద్ షెట్ తనవాడే, కమల్ జీత్ సెహ్రావత్‌లు సహ-ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. రాజస్థాన్ బాధ్యతలను సంజయ్ భాటియాకు అప్పగించగా, కవితా పాటీదార్, కుల్జీత్ చాహల్ అక్కడ సహాయక బాధ్యతలు నిర్వర్తిస్తారు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఇన్ఛార్జ్‌గా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. తెలంగాణ సహ-ఇన్ఛార్జీలుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్‌గా అరవింద్ భదోరియా, సహ-ఇన్ఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఒడిశాకు డి. పురందరేశ్వరిని ఇన్ఛార్జ్‌గా నియమించారు.

ఇతర రాష్ట్రాల్లో.. కర్ణాటక, బీహార్‌లకు హరీష్ ద్వివేది, కేరళకు ప్రొఫెసర్ ఎం. నాగరాజ, ఉత్తరాఖండ్‌కు రామ్ మాధవ్, హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మ, అస్సాంకు మంగళ్ పాండేలు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు వహిస్తారు. వీరితో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్‌కు జయప్రకాష్, అరుణాచల్ ప్రదేశ్‌కు దేవేష్ కుమార్, చండీగఢ్‌కు మహేంద్ర పాండే, గోవాకు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, జార్ఖండ్‌కు గజేంద్ర పటేల్, లడఖ్‌కు రాజ్‌కుమార్ భాటియా, లక్షద్వీప్‌కు జార్జ్ కురియన్‌లను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

హిందూస్తాన్ సమచార్ / Sachin Budhauliya


 rajesh pande