
ముంబై, 25 సెప్టెంబర్ (హి.స.) బంగారం ధరలు శుక్రవారం ఉదయం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఈ రోజు శుక్రవారం ఉదయం 7:00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,670గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,940గా ట్రేడ్ అవుతోంది.మరోవైపు వెండి ధరలు కూడా కాస్తంత పతనమయ్యాయి.
కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం.. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,820 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,940 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV