
ముంబై, 24 సెప్టెంబర్ (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీలు భారీగా కుప్పకూలాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు అనూహ్యంగా భగ్గుమనడం, ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురై అమ్మకాలకు తెగబడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,180 పాయింట్లకు పైగా పతనమై దలాల్ స్ట్రీట్ను వణికించగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 370 పాయింట్లకు పైగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది.
గ్లోబల్ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సూచీలు, సమయం గడిచే కొద్దీ మరింత దిగజారి మదుపర్ల సంపదను భారీగా హరించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు