వారం రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర
భారత్లో గత వారం బంగారం ధరల్లో భారీగానే కోత పడింది.
Bullion-Market-Gold-Silver


ముంబై, 27 సెప్టెంబర్ (హి.స.)భారత్లో గత వారం బంగారం ధరల్లో భారీగానే కోత పడింది. రూ.3,160 మేర ధరలు తగ్గాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలు, యూఎస్ ట్రెజరీ బాండ్స్పై రాబడుల్లో పెరుగుదల వంటివి బంగారానికి డిమాండ్ తగ్గేలా చేశాయి.

దేశీయంగా కాస్త డిమాండ్ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,680గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,39,950 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,510 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,010 వద్ద కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande