శరన్నవరాత్రి ఉత్సవాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
ఈఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 25 లక్షల మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Vijayawada temple


అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.) దసరా శరన్నవరాత్రోత్సవాలు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఎంత వైభవంగా జరుగుతాయో మనందరికీ తెలిసిందే..ఈఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 25 లక్షల మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఈరోజు(సోమవారం) దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల 4వ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా దసరా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.

ప్రతీరోజూ సగటున 2 లక్షల భక్తులు దుర్గగుడికి వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని నిర్ణయించామని తెలిపారు.

త్రాగునీరు, వేడిపాలు, బిస్కెట్లు, ఆహార పదార్థాలు ఉంటాయన్నారు. వైద్య సిబ్బందిని ప్రతిచోటా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దసరాతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande