శంషాబాద్లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో క్యాబ్ ప్రయాణానికి సంబంధించిన తీవ్రమైన ఘటన నమోదైంది.
Harassment


హైదరాబాద్ , 28 సెప్టెంబర్ (హి.స.)రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో క్యాబ్ ప్రయాణానికి సంబంధించిన తీవ్రమైన ఘటన నమోదైంది. టోల్ప్లాజా సమీపంలో క్యాబ్ డ్రైవర్ తనను ఒంటరి ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ప్రకారం, మహిళ క్యాబ్లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నిర్ణయించిన మార్గం కాకుండా వేరే ప్రాంతం వైపు వాహనాన్ని మళ్లించాడని మహిళ పోలీసులకు తెలిపింది. టోండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో వాహనాన్ని ఒక నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లిన అనంతరం దాడికి ప్రయత్నించాడని మహిళ పేర్కొంది. డ్రైవర్ మహిళకు చెందిన బ్యాగ్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్లు, ఆ బ్యాగులో రూ.60 వేల నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నది. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande