
చిత్తూరు, 28 సెప్టెంబర్ (హి.స.)
చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రాకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
మానవ-ఏనుగుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా తక్షణ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏనుగుల సంచారం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్త నష్టం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఏనుగుల గుంపు సురక్షితంగా తిరిగి అడవిలోకి ప్రవేశించేలా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, అటవీ శాఖ సిబ్బందిని రంగంలోకి దించి పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ