SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి
రాష్ట్రంలో SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది.
SIR


అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల నోటీసులకు విచారణ పూర్తైంది. దీంతో మొత్తం 99.92 శాతం నోటీసుల విచారణ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 3,629 నోటీసులు మాత్రమే విచారణకు మిగిలి ఉన్నాయి. తిరుపతి, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన నోటీసుల విచారణ పెండింగ్లో ఉంది. తిరుపతి జిల్లాలో 2,477 నోటీసులు విచారణకు మిగిలి ఉండగా.. ఎన్టీఆర్ జిల్లాలో 486, అనంతపురంలో 257, పల్నాడులో 205, ప్రకాశంలో109 నోటీసులు విచారణకు పెండింగ్లో ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అత్యల్పంగా పెండింగ్లో ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande