అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్-2026 కార్యక్రమం
విజయవాడ ఉత్సవ్-2026 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.
Vijayawada utsav


అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడ ఉత్సవ్-2026 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈరోజు (సోమవారం) నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'విజయవాడకు చారిత్రక నేపథ్యం, ఘనమైన వారసత్వ సంపద ఉంది. కళలు, రాజకీయాలకు ఈ నగరం ప్రతీక. ఇవన్నీ కలబోసి విజయవాడ ఉత్సవ్ను నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్కు, సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమం కాదు.. చిరు వ్యాపారులు ఆర్థికంగా బలపడే కార్యక్రమం అన్నారు.ఎక్కడికి వెళ్లినా మన తెలుగు వారు భాగస్వామ్యం అవుతున్నారు అన్నారు.

విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలతో పాటు, విజయవాడ ఉత్సవ్లోనూ అందరూ భాగస్వామ్యం కావాలని భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సంపద సృష్టించబడుతుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కారణంగా ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికం, సాంస్కృతికం, సమ్మేళనంతో అందరికీ ఆనందాన్ని పంచుతుంది. విజయవాడ ఉత్సవ్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు ప్రజలను అలరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి అని అన్నారు.

కృష్ణా తీరాన్ని సాంస్కృతిక తీరంగా మార్చిన ఘనత ఎంపీ కేశినేనిదే అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహభాగస్వామిగా ఏపీ పర్యాటక శాఖ ఉండటం ఆనందంగా ఉందన్నారు. గతేడాది వైబ్రంట్ పేరుకు తగ్గట్లే అద్భుతంగా విజయవాడ ఉత్సవ్ను నిర్వహించారని కొనియాడారు. ఈసారి కూడా ఇంకా గొప్పగా ఈ ఉత్సవ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande