గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.... కలెక్టర్ కోయ శ్రీహర్ష
గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
Collector


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

సోమవారం మంథనిలో పర్యటించి గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు, పుష్కరాల కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత అధికారులు, రైతులతో పుష్కరాల అవసరాలకు సంబంధించిన ఎండోమెంట్, ఇరిగేషన్ భూసేకరణ అంశాల పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మంథనిలో అవసరమైన అభివృద్ధి పనులను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల కోసం అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించి, పెండింగ్లో ఉన్న భూసేకరణ అంశాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande