ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం.. అదనపు డిక్లరేషన్ తొలగింపు..
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది
Ec


న్యూఢిల్లీ, 30 సెప్టెంబర్ (హి.స.)

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన రాష్ట్రాల్లో, కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి సౌలభ్యం కోసం ఫారం 6 లో పొందుపరచిన అదనపు డిక్లరేషన్ను ఎలక్షన్ కమిషన్ వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా చర్యలు చేపట్టిన ఈసీ.. సంబంధిత రాష్ట్రాల్లోని ఈసీనెట్ (ECINET) యాప్, పోర్టల్ అలాగే ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెబ్సైట్ల నుంచి ఈ అదనపు డిక్లరేషన్ ఆప్షన్ను పూర్తిగా తొలగించింది. తాజా మార్పుతో ఎస్ఐర్ (SIR) ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే యువతకు, అర్హులైన పౌరులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంతో కొత్త ఓటర్లు గతంలో జరిగిన ఎస్ఐర్ సర్వే వివరాలు, తమ తల్లిదండ్రులు, తాతముత్తాతలకు సంబంధించిన పాత ఓటర్ల జాబితా వివరాలను లింక్ చేయాల్సిన అవసరం ఉండదు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande