రైతులకు కేంద్రం తీపికబురు.. పప్పుధాన్యాల మద్దతు ధర భారీగా పెంపు
రైతులకు కేంద్రం తీపికబురు.. పప్పుధాన్యాల మద్దతు ధర భారీగా పెంపు
Farmers


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. దేశ ఆర్థిక, వ్యవసాయ, సాంకేతిక రంగానికి సంబంధించి కేబినెట్ పలు చారిత్రక ఆమోదాలు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు.

వ్యవసాయ రంగం, అన్నదాతలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర (MSP) 2027-28 సంవత్సరానికి గాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమల మద్దతు ధరను క్వింటాల్కు రూ.2,585 నుంచి రూ.2,610కి పెంచారు. అదేవిధంగా శెనగల మద్దతు ధరను క్వింటాల్కు రూ.5,875 నుంచి రూ.5,958గా, అలాగా బార్లీకి రూ.2,150 నుంచి రూ.2,286గా నిర్ణయించారు, ఎర్రపప్పు మద్దతు ధరను రూ.7,000 వేల నుంచి రూ.7,390కి పెంచారు. అంతేకాకుండా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పప్పుధాన్యాలు, నూనెగింజల సేకరణ కోసం 55.48 బిలియన్ రూపాయిల ప్రొక్యూర్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే తాజా నిర్ణయాలు రైతులకు ఆర్థిక భద్రతను చేకూర్చనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande