
ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపింది.
తాజా సమాచారం ప్రకారం, మొత్తం 5,165 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో ప్రస్తుతం బోర్డు నిమగ్నమై ఉంది. ఈ నెల 26వ తేదీలోపు దేశంలోని అన్ని రైల్వే జోన్ల నుంచి ఖాళీల వివరాలను సమర్పించాలని ఉన్నతాధికారులు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ రిక్రూట్మెంట్ గురించి ప్రముఖ విద్యా సమాచార వెబ్సైట్లైన ప్రాక్టీస్మాక్, అడ్డా247 తమ కథనాల్లో కీలక విషయాలను వెల్లడించాయి. రైల్వే శాఖ రెండు విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో గ్రాడ్యుయేట్ స్థాయి అభ్యర్థుల కోసం ఒక విభాగం, అండర్ గ్రాడ్యుయేట్ (ఇంటర్మీడియట్) స్థాయి అభ్యర్థుల కోసం మరో విభాగం ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్