ఇస్రో విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయాన్ని అభినందించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ విజయం దేశానికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
PM modi


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయాన్ని అభినందించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ విజయం దేశానికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి ఇది మరొక నిదర్శనమంటూ ప్రధాని ప్రశంసలు కురిపించారు.

జీఎస్ఎల్వీ-ఎఫ్17 ద్వారా జరిగిన ఈ విజయవంతమైన ప్రయోగం.. భారత అంతరిక్ష రంగం సాధిస్తోన్న అత్యుత్తమ ప్రగతికి, ఆవిష్కరణలకు, విస్తృత సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచింది అన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు.. ఈ రంగంలో మన సమర్థతను మరింత బలోపేతం చేస్తోంది అని మోదీ తెలిపారు.

నేడు తెల్లవారుజామున 2.55 గంటలకు షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 (GSLV-F17) వాహకనౌక మేఘాలను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని సబ్-జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(సబ్-జీటీఓ)లోకి కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. సరిహద్దుల్లో శత్రు దేశాలు సైనిక స్థావరాలను ఎంత రహస్యంగా దాచినప్పటికీ.. వాటిని ఇట్టే పసిగట్టే సత్తా ఈ ఉపగ్రహానికి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande