శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో ఒక ఆరో నంబరు బే పై విమానాన్ని పార్కింగ్ చేస్తుండగా సాంకేతిక స్తంభాన్ని ఢీకొట్టింది.
Indigo


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.)ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో ఒక ఆరో నంబరు బే పై విమానాన్ని పార్కింగ్ చేస్తుండగా సాంకేతిక స్తంభాన్ని ఢీకొట్టింది.

విమానంలోని ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే విమానం ముందు భాగం దెబ్బతిన్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆ విమానం ఈ ఉదయం ముంబయి నుంచి శ్రీనగర్కు ప్రయాణించినట్లు పేర్కొంది. ఈ ఘటన తర్వాత విమానం మాన్యువల్ మెట్లపై నుంచి ప్రయాణికులను విమానాశ్రయ సిబ్బంది సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఏఏఐ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande