నేపాల్ వరద బాధితులకు అండగా కేంద్రం ప్రభుత్వం
నేపాల్ వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుచ్చింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ల ద్వారా డీఎన్ఏ ప్రొఫైలింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఎంఈఏ పేర్కొంది.
Nepal floods


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.)నేపాల్ వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుచ్చింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ల ద్వారా డీఎన్ఏ ప్రొఫైలింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఎంఈఏ పేర్కొంది. నేపాల్లో గల్లంతైన వారి బంధువులు అంటే తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె లేదా తోబుట్టువులు ప్రస్తుతం భారత్ లో నివసిస్తుంటే, వారు ఈ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది. సమీప బంధువుల నుంచి డీఎన్ ఏ నమూనాలను సేకరించి, వాటి ఆధారంగా డీఎన్ఏ ప్రొఫైల్ను సిద్ధం చేయాలని వెల్లడించింది. అలా నేపాల్లో గుర్తుతెలియని మృతదేహాలను డీఎన్ఏతో పోల్చడం ద్వారా వారి గుర్తింపు నిర్ధారించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande