
న్యూఢిల్లీ, 04 సెప్టెంబర్ (హి.స.) ఫుకెట్ నుంచి రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో తీవ్ర కుదుపు ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
తాజాగా ఆ ఫ్లైట్ పైలట్-ఇన్-కమాండ్ సైకోయాక్టివ్ డ్రగ్స్ వినియోగించినట్లుగా డోప్ టెస్ట్లో తేలింది. ఈ మేరకు ఎయిరాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక విచారణ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
విమానం గాల్లో ఉండగా అకస్మాత్తుగా తీవ్ర కుదుపులకు గురై కిందకు జారిపోయిన ఘటనపై విచారణ చేపట్టగా.. ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో పైలట్ బ్లడ్ శ్యాంపిల్స్ గంజాయి ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. అయితే, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఏఏఐబీ (AAIB) భవిష్యత్తులో పైలట్లు ఇలాంటి మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తగిన కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
కాగా, ఆగస్టు 4న పుకెట్ నుంచి రాజధాని ల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం టెక్నికల్ లోపాలు, అకస్మాత్తుగా ఎత్తు కోల్పోవడం వల్ల జరిగిన ప్రమాదంలో కొందరు ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు