భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార పనులు త్వరగా పూర్తి చేయాలి.. మంత్రి పొంగులేటి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు.
Ponguleti


భద్రాద్రి కొత్తగూడెం, 04 సెప్టెంబర్ (హి.స.)

భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు.

జిల్లా కలెక్టర్ అంకిత్,భద్రాచలం, పినపాక,అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు,జారే ఆదినారాయణ తో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రామాలయం అభివృద్ధి పనులను పరిశీలించారు. చిత్రకూట మండపం పరిసరాలను,గోశాల ప్రాంతాన్నీ, అన్నదాన సత్రం,విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అభివృద్ధికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్స్ ను, ఆర్కిటెక్చర్లను సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అదేవిధంగా వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande