జేఎన్టీయూ హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ
కూకట్పల్లి జేఎన్టీయూ హాస్టల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
DCP


హైదరాబాద్, 04 సెప్టెంబర్ (హి.స.) కూకట్పల్లి జేఎన్టీయూ హాస్టల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.

మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం కూకట్పల్లిలో డీసీపీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గురువారం జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందన్నారు.

ఈ నేపథ్యంలో డయల్ 100కి ఫోన్ చేస్తే.. పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. మళ్లీ అర్ధరాత్రి 2:30కి రెండు వర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారని వివరించారు. దాంతో ఓ విద్యార్థికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande