
హైదరాబాద్, 04 సెప్టెంబర్ (హి.స.) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది.
యమ్నంపేటలోని ఓ యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది. యూనివర్సిటీ సిబ్బంది సమాచారంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలిలో క్లూస్ టీమ్తో ఆధారాల సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతురాలి వయసు దాదాపు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దాదాపు వారం రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్