
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయం జరిగిందన్నారు. ప్రస్తుతం సగటు ధర కిలోకు రూ.209.83 పలుకుతోందని వెల్లడించారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్పై ఒత్తిడి ఏర్పడిందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ