కెనాల్లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతు
కెనాల్లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
Water


అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)

కెనాల్లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లె గ్రామ సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కటకానిపల్లెకి చెందిన పుప్పాల రాజ్కుమార్కు ఈ నెల 7న వివాహం జరగాల్సి ఉంది. ఈక్రమంలో స్నేహితులు, బంధువులైన ఏడుగురితో కలిసి శనివారం మధ్యాహ్నం గ్రామానికి దగ్గరలోని ఫీడర్ కెనాల్ వద్ద పార్టీ చేసుకున్నారు. అనంతరం రాజ్కుమార్, వినయ్కుమార్, రాజు సరదాగా ఈత కొడదామంటూ నీటిలో దిగారు. ప్రవాహ వేగానికి రాజ్కుమార్(23), వినయ్కుమార్(22) కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన రాజు అప్రమత్తమై ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande