అన్నమయ్య జిల్లాలో ప్రజా భద్రతపై విస్తృత అవగాహన
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
annamayya-sp-dhiraj-kunubilli-village-night-halt-safety-drive-181


అన్నమయ్య జిల్లా, 06 సెప్టెంబర్ (హి.స.) అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలనతో పాటు హెల్మెట్ వాడకం, రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కమిటీలకు సూచనలు చేయడంతో పాటు, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

పల్లె నిద్రలో భాగంగా గ్రామస్థులతో పోలీసు అధికారులు సమావేశమై శాంతిభద్రతలు, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, ఆస్తి నేరాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్థుల నుంచి స్థానిక సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతకు సంబంధించిన అంశాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande