ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఏపీ జేఏసీ ఛైర్మన్ హర్షం
సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం పట్ల ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు.
AP Govt


అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)

సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం పట్ల ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవులు, హెల్త్ కార్డులు, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తదితర అంశాలపై సీఎంతో జరిగిన చర్చల్లో పలు హామీలు లభించాయని చెప్పుకొచ్చారాయన. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. పెండింగ్లో ఉన్న మొత్తం 5 డీఏల్లో రెండింటిని ఒకే నెలలో చెల్లిస్తామని, సరెండర్ లీవ్లకు సంబంధించి ఒక విడత చెల్లింపు చేస్తామని చెప్పారన్నారు. పోలీస్ ఉద్యోగులకూ సెప్టెంబర్ నుంచి అదనంగా మరో సరెండర్ లీవ్ ప్రకటించినట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande