నిర్లక్ష్యంగ అన్నవరం ఆలయం అధికారులు
అన్నవరం ఆలయంలో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదులను ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి ఆన్లైన్లో గదులు అందుబాటులో కలిపించడం లేదు.
Annavaram

అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)

అన్నవరం ఆలయంలో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదులను ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి ఆన్లైన్లో గదులు అందుబాటులో కలిపించడం లేదు.

నెల రోజులు ముందుగా వసతి గదిని ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశముంది. కొండపైన గదులు అందుబాటులో లేవు. కొండ దిగువన ఉన్న సత్యనికేతన్ సత్రం మాత్రం నామమాత్రంగా చూపిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 5 వరకు పరిశీలించినా ఇదే పరిస్థితి. గత నెలాఖరు నుంచి వెబ్సైట్ను మార్పు చేశారు. కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చినా సక్రమంగా భక్తులకు అందని తీరు నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే గదులు అందుబాటులో ఉంచకుండా తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక సమాచారం తెలుసుకునేందుకు కేటాయించిన 94912 49990 నంబరు సక్రమంగా పనిచేయడం లేదు. అనేక సందర్భాల్లో స్విచ్ఛాప్ అని వస్తోందని భక్తులు మండిపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande