అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి......కేసీఆర్
బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది.
Kcr


తెలంగాణ , 06 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన సమావేశానికి కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలన్నారు. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఉభయసభల్లో ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అని అన్నారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పాలన కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్ పోవడం ఖాయమని, రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ పక్షపాత వైఖరి అప్రజాస్వామికమన్నారు. సభలో స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande