
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
విద్యాశాఖ మంత్రి లోకేశ్ 2029 లోగా మరో 3 డీఎస్సీలను నిర్వహిస్తామని అన్నారు. గతేడాది మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టుల భర్తీని ఎంత పారదర్శకంగా నిర్వహించామో.. అదేవిధంగా భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియనివారు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏం ఫర్వాలేదు, భయపడేది లేదని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలపై దృష్టి సారించామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ