
తిరుమల, 06 సెప్టెంబర్ (హి.స.)తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుండటం భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు ప్రతిపాదన రూపొందించిందని, ఈ మేరకు తాను రాసిన లేఖకు రైల్వేశాఖ నుంచి సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు
“ఈ కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే.. శివమొగ్గ-తిరుపతి మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. తిరుపతికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. విద్య, వైద్యం, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV