15 బస్సు సర్వీసులు ప్రారంభించిన గ్రేటర్ ఆర్టీసీ
గ్రేటర్ ఆర్టీసీ సుదూర బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ఒకే బస్సులో సగటున 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
Rtc


తెలంగాణ , 06 సెప్టెంబర్ (హి.స.)గ్రేటర్ ఆర్టీసీ సుదూర బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ఒకే బస్సులో సగటున 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీనివల్ల రెండు లేదా మూడు సార్లు బస్సులు మారాల్సిన అవసరం ఉండదు. ఆర్టీసీ మొత్తం 15 సర్వీసులను ప్రారంభించింది. ఈ విధానం వల్ల శివారు ప్రాంతాల ప్రజలు ఇప్పుడు గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, బొటానికల్ గార్డెన్, శిల్పారామం, బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సులభంగా సందర్శించవచ్చు. కోఠి టూ కొల్లూరు రూట్లో 116ఎన్ /220కె, 217/220కె, 218/220కె బస్సులు అందుబాటులో ఉన్నాయి.

సికింద్రాబాద్ నుంచి కొల్లూరు రూట్లో 10H/220, 219/220K సర్వీసులు నడుస్తాయి.

సికింద్రాబాద్, ఘట్కేసర్ మధ్య ఆర్టీసీ ప్రత్యక్ష బస్సు సర్వీసును (24B/281) ప్రవేశపెట్టింది.

సనత్నగర్ నుంచి మెహదీపట్నం మీదుగా నేరుగా వెళ్లేందుకు ఆర్టీసీ 19ఎస్ /505 సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande