మిల్లెట్ ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు: కలెక్టర్ చాహత్ బాజ్పాయి
మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అన్నారు.
Collector


హనుమకొండ, 06 సెప్టెంబర్ (హి.స.) మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అన్నారు.

ఆదివారం హనుమకొండ గోపాల్ పూర్ జవహర్ కాలనీలో ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్ప్రైన్యూషిప్ లో భాగంగా నెలకొల్పిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఉత్పత్తి యూనిట్ కు సంబంధించిన వివరాలను ఎంటర్ప్రైన్యూరర్ ఉజ్వలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హనుమకొండలో దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ బేస్డ్ మిల్లెట్ పన్నీర్ తయారీ యూనిట్ ఇది అని, ఈ యూనిట్లో పాల ఉత్పత్తులతో కాకుండా మొక్కల నుంచి లభించే ప్రోటీన్ను ఉపయోగించి నాన్-డెయిరీ మిల్లెట్ పన్నీర్, మిల్లెట్ బాసుంది తయారు చేస్తామని తెలిపారు. ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ప్రత్యామ్నాయ ఆహార ఉత్పత్తుల తయారీకి ఈ యూనిట్ దోహదపడుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande