
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
స్థానికసంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ
సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత, గుంటూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బోనబోయిన శ్రీనివాస్ పేర్కొన్నారు.
పార్టీ కోసం మొదటినుంచి కష్టపడినవారికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. టీడీపీ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం బీసీల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని బోనబోయిన కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ