
హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.) సీవీ ఆనంద్ డీజీపీ అయిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తనపై కానిస్టేబుల్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే సస్పెన్షన్తో సరిపెడతారా అంటూ మండిపడ్డారు. తనపైన పెట్టిన పోస్టు డీజీపీ కుటుంబ సభ్యులపై పెడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తనపైన పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు పెట్టి చర్యలు తీసుకోకపోతే ఇంటర్ నేషనల్ లెవెల్లో ప్రభుత్వాన్ని బదనాం చేస్తానని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ
ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నారు. కోదండరాం పక్కన ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారు. ఉద్యమకారులపై వేసిన కె.కె కమిటీ ఏమైంది? ఉద్యమకారులకు తెలంగాణ జన సమితి నుంచి కోదండరామ్ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను తొక్కుకుంటూ పోతే ఎలా? అసెంబ్లీ సమావేశాల్లోపు ఉద్యమకారులపై సీఎం నిర్ణయం తీసుకోవాలి. కె.కె కమిటీ రిపోర్ట్ త్వరగా ఇవ్వాలి’... అసెంబ్లీలో హేట్ స్పీచ్పై చట్టం చేయాలి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలపై 100 రోజుల కార్యాచరణ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. బీసీల కోసం చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. జనాభా లెక్కల సేకరణలో బీజేపీ తప్పు చేస్తోంది’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్