కొడంగల్పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత కొడంగల్పై ఫోకస్ పెట్టారు. కొడంగల్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పాంచజన్య శంఖారావం చేపడుతున్నట్లు ప్రకటించారు.
Kavitha


హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత కొడంగల్పై ఫోకస్ పెట్టారు. కొడంగల్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పాంచజన్య శంఖారావం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీన కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు (ఆదివారం) తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.

బహుజన తెలంగాణ సాధనే మా లక్ష్యం..

సీఎం రేవంత్రెడ్డి సర్కార్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని కవిత విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో సగం కూడా ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. బహుజన తెలంగాణ సాధనే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. తెలంగాణ రక్షణ సేనలో బీజేపీ కొడంగల్ ఇన్చార్జి ప్రభాకర్ కులకర్ణి చేరారు. కులకర్ణితో పాటు ఆయన అనుచరులకు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande