
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు ముఖ్యఅతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు.
సోమవారం జరిగే ట్రస్ట్ రజతోత్సవాలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు పొంగూరు నారాయణ, వై.సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ