రైతులకు వాతావరణ శాఖ నుండి చల్లటి కబురు
వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
Rain


కర్నూలు, 06 సెప్టెంబర్ (హి.స.)వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వాతావరణం

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఆది, సోమవారాల్లో వర్షంతో పాటు బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది..

ఇక రాబోయే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది. ఇక రాయలసీమలో కూడా రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande