బంగారం ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు మరోసారి ఢమాల్
నేటి (సెప్టెంబర్ 6) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,800గా ఉంది.
gold


ముంబై, 06 సెప్టెంబర్ (హి.స.)భారత్లో గతం వారం బంగారం ధరల్లో కోత పడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు కోతపై అంచనాలతో వారం మొదట్లో ధరలు వరుసగా పెరిగినా ఆ తరువాత అంచనాలు తలకిందులై మళ్లీ కోత మండింది. చివరకు గత వారం ధరలు స్థూలంగా రూ.3,440 మేర తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 6) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,900 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2.5 లక్షలుగా ఉంది. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,800 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,900గా కొనసాగుతోంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,670 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,610గా ఉన్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,950గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande