
ముంబై, 05 సెప్టెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
ఇటీవల తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు దిగువన ఉన్న ధరలు.. ఇప్పుడు రూ.1.60 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా సెప్టెంబర్ 5వ తేదీన తులం బంగారం ధర రూ.1,56,670 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు, తగ్గవచ్చు.లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
కోల్కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV