తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాట గంగమ్మ గుడి దగ్గర భక్తులు క్యూలో చేరుతున్నారు.
తిరుమల


తిరుమల, 06 సెప్టెంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాట గంగమ్మ గుడి దగ్గర భక్తులు క్యూలో చేరుతున్నారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి వెళ్లే భక్తులకు 4-6 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (శనివారం) స్వామివారిని 84,166 మంది భక్తులు దర్శించుకోగా.. 36,673 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీకి రూ.4.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది. నిన్న 4.74 లక్షల లడ్డూలను విక్రయించినట్లు వివరించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande