గోల్డ్ రేట్స్.. వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
గత వారంలో బంగారం ధరల్లో కోత పడింది. ఈ వారమూ హెచ్చుతగ్గులు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
gold


ముంబై, 07 సెప్టెంబర్ (హి.స.) గతవారం భారత్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వారం ప్రథమార్థంలో భారీగా తగ్గిన ధరలు ఆ తరువాత కాస్త పెరిగాయి. స్థూలంగా చూస్తే గత వారం ధరల్లో రూ.3 వేల పైచిలుకు మేర కోత పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 7) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,790గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,890 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,16,890 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2.54 లక్షలుగా ఉంది.

దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు

దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,790 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,890గా కొనసాగుతోంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,790 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,890గా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉన్నాయి.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande