Custom Heading

హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్
హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ కాలనీలో తోటిపిల్లలతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలుడు డ్రైనేజీ సంపులో పడ
హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్


హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ కాలనీలో తోటిపిల్లలతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలుడు డ్రైనేజీ సంపులో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన రాజు, అనుబాయి దంపతుల కుమారుడు అరవి మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ఆదృశ్యమయ్యాడు.

బాలుడి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ రోజు ఉదయం ఇంటికి సమీపంలో ఉన్న డ్రైనేజీ సంపులో బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హిందూస్థాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande