సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలోరెండు మృతదేహాలు లభ్యం
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి20( హింస) సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలోరెండు మృతదేహాలు లభ్యం


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి20( హింస)

సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి ఆచూకీ లభించని వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బిల్డింగులో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. బిల్డింగ్ వెనుక భాగంలో గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు బూడిదయ్యాయి. వీటిని డ్రోన్ కెమెరా సాయంతో కనిపెట్టారు అధికారులు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దంతాలు తప్ప మరేమి దొరికే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రమాదంలో వసీం, జునైద్, జహీర్ మిస్ అయ్యారు. మృతులు బీహార్కు చెందిన కూలీలుగా గుర్తించారు అధికారులు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande