స్కూటరిస్టు అదుపు తప్పి దట్టమైన లోయలో పడిపోయాడు
అమరావతి,: జనవరి ,21( హింస) స్కూటరిస్టు అదుపు తప్పి దట్టమైన లోయలో పడిపోయాడు. ఎడమకాలు విరగడంతో ఎటూ కద
స్కూటరిస్టు అదుపు తప్పి దట్టమైన లోయలో పడిపోయాడు


అమరావతి,: జనవరి ,21( హింస) స్కూటరిస్టు అదుపు తప్పి దట్టమైన లోయలో పడిపోయాడు. ఎడమకాలు విరగడంతో ఎటూ కదల్లేక సుమారు 24గంటల పాటు నరకయాతన పడ్డాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం రిజర్వాయర్ సమీపంలో శుక్రవారం వెలుగు చూసిందీ ఘటన. బాధితుడి కథనం మేరకు.. పిచ్చాటూరు మండలం రామగిరి ఎస్టీ కాలనీకి చెందిన తుపాకుల అమావాసయ్య(దేవ)(40) కేవీబీపురం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లు కూలీ. ఏర్పేడులోని చెల్లెలింటికి గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. 2గంటల సమయంలో రామాపురం రిజర్వాయర్ వద్ద ఘాట్ మలుపులో వెళుతుండగా రోడ్డు పక్కన గ్రావెల్పైకి బండి వెళ్లడంతో జారి కిందపడ్డాడు. అప్పటి నుంచి కాపాడండంటూ చీకటి పడేవరకు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది.

శుక్రవారం మధ్యాహ్నం 12గంటల వరకు కూడా రక్షించండంటూ అరుస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్లిన మేకల కాపరులిద్దరు అతడిని గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి అగ్నిమాపక సిబ్బంది బాధితుడిని పైకి తీసి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

హిందుస్థాన్ సమాచార/ నాగరాజ్


 rajesh pande