వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెంపు
డీల్లీ, 1 నవంబర్ (హిం.స) దేశంలో మళ్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. బుధవారం కమర్షియల్ ఎల్ప
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెంపు


డీల్లీ, 1 నవంబర్ (హిం.స)

దేశంలో మళ్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. బుధవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరిగింది.

గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచడం ఇది రెండోసారి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం దేశంలోని పలు చోట్ల వాణిజ్య ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను రూ. 100కు పైగా పెంచాయి.

19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1,731కి బదులుగా రూ.1,833 అవుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర పెరుగుదలతో హోటళ్లలో తినుబండారాల ధరలు కూడా పెరగనున్నాయి. ముంబయిలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రూ.1,785.50, కోల్కతాలో రూ.1,943, చెన్నైలో రూ.1,999.50లకు పెరిగింది. అక్టోబర్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ముంబయిలో రూ.1,684, కోల్కతాలో రూ.1,839.50, చెన్నైలో రూ.1,898గా ఉన్నాయి.

గృహ అవసరాల వంట అవసరాల కోసం ఉపయోగించే కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903 వద్ద ఉంది. దేశీయ వంట సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande