చుక్కల నంటుతున్న బంగారం ధర.. అందుకోలేకపోతున్న సామాన్య ప్రజలు..
తెలంగాణ: హైదరాబాద్; ఏప్రిల్ 7 (హిం.స) రోజురోజుకు చుక్కల నంటుతున్న బంగారం ధర సామాన్య ప్రజలను ఆందోళనకు
చుక్కల నంటుతున్న బంగారం ధర.. అందుకోలేకపోతున్న సామాన్య ప్రజలు..


తెలంగాణ: హైదరాబాద్; ఏప్రిల్ 7 (హిం.స) రోజురోజుకు చుక్కల నంటుతున్న బంగారం ధర సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. బంగారం. అనేది. పేద.. మధ్యతరగతి భేదం లేకుండా కుటుంబాలతో పెనవేసుకున్న ఒక బంధం. రేపటి అవసరాలకు.. ఇప్పటి అలంకారానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో పైసాపైసా కూడబెట్టి మరీ సామాన్యులు కూడా పసిడి కొనుగోలు చేస్తుంటారు. పండగలు.. వివాహ శుభకార్యాల సమయంలో దీనికి ఫుల్ డిమాండ్ ఉండడం తెలిసింది. కుటుంబ సభ్యులు కొనాలని అనుకున్నపుడు కాస్త తగ్గాక చూద్దామని వాయిదా వేశాం. ఇప్పుడేమో ఆకాశాన్నంటిన ధరలు చూసి కొనే సాహసం చేయలేకపోతున్నామంటున్నారు మహిళలు. కొద్దిరోజులు పెరుగుతూ వచ్చిన స్వర్ణం.. తాజాగా రికార్డు స్థాయికి చేరింది.

తులం ధర రూ.73 వేలకు పైన పసిడి ధర పరుగులు పెడుతోంది. రోజుకో జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుతోంది. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా మూడువేలకు పైగా ధర పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారట్ల పుత్తడి ధర నగరంలో రూ.73150 పలికింది. ఈ పరుగు ఇంకెక్కడి దాకా వెళుతుందోనని ఆందోళను సామాన్య జనం చెందుతున్నారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande