45 వేల మందితో.. అందుబాటులోకి అంతర్జాతీయ క్రూయిజ్
ముంబై, 6 నవంబర్ (హిం.స) లోతైన నీలి సముద్రం, నీలి ఆకాశం, ప్రవహించే నీరు ఎటు చూసిన మన కళ్లకు మెరుస్తూ
ే45 వేల మందితో.. అందుబాటులోకి అంతర్జాతీయ క్రూయిజ్‌


ముంబై, 6 నవంబర్ (హిం.స)

లోతైన నీలి సముద్రం, నీలి ఆకాశం, ప్రవహించే నీరు ఎటు చూసిన మన కళ్లకు మెరుస్తూ కనిపిస్తుంది. చుట్టూ వీచే చల్లని గాలి గిలిగింతలు పెడుతుంటే.. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనే గానీ, చెబితే మాటలు సరిపోవు.. ఇది క్రూయిజ్ టూర్ విశిష్టత… మీరు మీ దేశాన్ని సముద్ర తీరంలో చూడాలనుకుంటే సిద్ధంగా ఉండండి.

అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ ‘కోస్టా మెరీనా’ భారత్లో పర్యాటక ప్రియులను అలరించేందుకు రెడీగా ఉంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ముంబైలో తన తొలి ప్రయాణానికి కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోస్టా క్రూయిజ్లు 2 నెలల పాటు సముద్రంలో ప్రయాణిస్తాయని, ఇందులో దాదాపు 45 వేల మంది ప్రయాణించవచ్చు. ఈ క్రూయిజ్ ఎక్కువగా ముంబై, గోవా, లక్షద్వీప్, కొచ్చిన్ చుట్టూ అందుబాటులో ఉంటుంది.

గంగా విలాస్ క్రూయిసెస్, దేశం, ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు జరుపుతుంది. ప్రస్తుతం అది మరోమారు ప్రయాణం మొదలుపెట్టింది. కోల్కతా నుంచి బయల్దేరిన క్రూయిజ్కు ఒకరోజు ధర రూ.50 వేలు. వారణాసి నుంచి దిబ్రూగఢ్కు 51 రోజుల ప్రయాణానికి రూ. 25 లక్షలు టిక్కెట్. జనవరి 13, 2023న ఈ క్రూయిజ్ని వారణాసి నుండి డిబ్రూగఢ్ (అసోం)కి నడిపించారు. ఈ క్రూయిజ్ తన తొలి ప్రయాణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande